ఒక రోజు అక్బర్, బీర్బల్ వేటకి వెళ్ళారు. అడవి లో చాలా కాకులు కనిపించాయి. ఆ కాకులను చూసి అక్బర్ మహారాజుకి ఒక ఆలోచన వచ్చింది. సరదాగా బీర్బల్ తెలివిని పరీక్షించాలనుకున్నాడు. వెంటనే తన పక్కన వున్న బీర్బల్ వైపుకు తిరిగి, “బీర్బల్, మన రాజ్యంలో ఎన్ని కాకులు వున్నాయి?” అని అడిగాడు.
బీర్బల్ వెంటనే చాకచక్యంగా “సామ్రాట్, మన రాజ్యంలో సరిగ్గా తొంభై తొమ్మిది వేల, ఆరు వందల నలభై మూడు కాకులు వున్నాయి” అని బదులు చెప్పాడు. ఆశ్చర్యపోయిన అక్బర్ మహారాజు, ఇలా అడిగారు.
అక్బర్: అంత కచ్చితంగా చెబుతున్నావు, అంతకన్నా ఎక్కువ కాకులుంటే?
బీర్బల్: అయితే పక్క రాజ్యాలనుంచి మన రాజ్యంలోని కాకుల చుట్టాలు వచ్చినట్టు!
అక్బర్: ఒక వేళ తక్కువ వుంటే?
బీర్బల్: అయితే మన రాజ్యం కాకులు వాళ్ళ చుట్టాలని కలవడానికి వెళ్ళినట్టూ! అన్నాడు 😃
ఎన్ని కాకులున్నాయో ఎవరికైనా ఎలా తెలుస్తుంది అని చెప్పకనే అక్బర్ మహారాజు కి అర్థమయ్యేలా చెప్పాడు బీర్బల్. అక్బర్ ఎప్పటిలాగే బీర్బల్ ని ప్రశంసించి వేటను కొనసాగించారు.
ఈ సందర్భానికి కొద్దిగా మార్పులు చేసి కొన్ని సినిమాలలో కూడా వాడారు.

0 comments: