Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
ఎవరే నువ్వు, ఎచటే నువ్వు...
ఎగసే సాగర కెరటానివో
ఉరిమే కాలమేఘానివో
కురిసే ముత్యపు చినుకువో...
ఎవరే నువ్వు, ఎచటే నువ్వు...

ఉదయాన కురిసే పొగమంచువో
సంధ్యవేలలో కానవచ్చు జాబిల్లివో
కొలనులో వికసించిన తామర పుష్పానివో...
ఎవరే నువ్వు, ఎచటే నువ్వు...

మోనాలిసా చిత్రానివో
కొండపల్లి బొమ్మవో
ఎల్లోరా శిల్పానివో...
ఎవరే నువ్వు, ఎచటే నువ్వు...

మధుర గానం చేసే కోకిలవో
రంగు రంగుల అందాల చిలకవో
ఆనందంతో నాట్యమాడే నాట్యమయూరివో...
ఎవరే నువ్వు, ఎచటే నువ్వు... 

0 comments: