Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
ముందుగా వచ్చిన ఈదురు గాలి,
అతిథి రాకను తెలుపుతుంటే-
దాని ఒళ్ళంతా దుమ్మని
నా శుభ్రమైన ఇంట్లోకి రానీకుండా
మొహమ్మీదే తలుపేసేశాను.

ప్రేమతో నన్నెలాగైనా కలవాలని వచ్చిన
వానజల్లునూ అంతే వేగంగా కిటికీలు మూసేసి ఆపేశాను.
ఉరుముల పిలుపులను
టీవీ అరుపుల్లోపడి వినిపించుకోనేలేదు
చిరుజల్లు తెచ్చిన మట్టి వాసనలు
చాట్ మసాల ఘుమఘుమల ముందు
పనికిరాలేదు.

సకల ప్రాణులను సంతోషపెట్టిన
ఆ స్వచ్ఛమైన వర్షపు చినుకులు-
నాకు మాత్రం
సమస్తాన్నీ బురదతో నింపే
పనికిరాని నీటి బిందువుల్లానే తోచేవి.

కానీ-
ఇప్పుడు అనుకోకుండా
ఈ వర్షంలో చిక్కుకుపోయినప్పుడు కదా
తెలిసింది ఈ వర్షం అంటే ఎంటో!

0 comments: