పద్యం:
వినదగు నెవ్వరు చెప్పిన
వినినంతనె వేగపడక వివరింపదగున్
గని కల్ల నిజము దెలిసిన
మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!
భావం:
ఎవ్వరు ఏమి చెప్పినా శ్రద్ధగా వినాలి.
విన్నవెంటనే తొందర పడకుండా నిదానంగా ఆలోచించి,
ఏది మంచో ఏది చెడో తెలుసుకొనిన వాడే వివేకం కలిగినవాడు.
by
Kathala Express
October 16, 2017
0 comments: