Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
     బీర్బల్ తెలివితేటలు తెలుసుకున్న ఇరాన్ రాజుకి ఒకసారి బీర్బల్ ను చూడాలనిపించింది. ఒకసారి తమ దేశం సందర్శించమని ఆ రాజు బీర్బల్ కి సందేశం పంపించాడు. మరో రెండు నెలలో ఇరాన్ కి వస్తానని బీర్బల్ వర్తమానం పంపాడు. బీర్బల్ వచ్చే సమయానికి ఇరాన్ రాజు అచ్చం తనలాగే దుస్తులు, టోపీ లూ పెట్టించి మరో ఐదుగుర్ని తనతో పాటు సింహాసనం పై కుర్చోబెట్టుకున్నాడు. బీర్బల్ తెలివి తేటలకు ఇదిఒక పరీక్ష అనుకున్నాడు.

   బీర్బల్ రానే వచ్చాడు. రాజభటులు బీర్బల్ ని సాదరంగా రాజ సభకు తీసుకువచ్చారు. బీర్బల్ ని చూద్దామని వచ్చిన ప్రజలతో సభ కిక్కిరిసిపోయింది. సభలో అడుగు పెట్టగానే బీర్బల్ ఆశ్చర్యపోయాడు. ఆరుగురు రాజులు కూర్చొని వుండటం చూసి తనకు పరీక్ష పెట్టడానికే ఈ ఏర్పాటు చేసారని అనుకున్నాడు. ఒక్క నిమిషం చూసి సరాసరి అసలు రాజు దగ్గరికి వెళ్లి అభివాదం చేసాడు. ఇరాన్ రాజు ఆశ్చర్యానికి అంతులేదు! ఇంతమందిలో నేనే రాజునని ఎలా తెలుసుకున్నారు మీరు? అని బీర్బల్ ని అడిగాడు. "ఏముంది రాజా! మీరు తిన్నగా చూస్తువుంటే ఈ నకిలీ రాజులు మిమల్నే చూస్తున్నారు" అన్నాడు బీర్బల్ .

   ఇంత నిశిత పరిశీలనా జ్ఞానం వుంది కాబట్టే మీరు మహా మేధావి! మిమ్మల్ని కలవటం మా అదృష్టం అని ఇరాన్ రాజు బీర్బల్ ని కౌగిలించుకున్నాడు. సభలో ప్రజలందరు బీర్బల్ తెలివికి జోహర్లు అర్పించారు!!!


0 comments: