ఉగ్గు పాల నుండి ఉయ్యాల లో నుండి
అమ్మ పాట పాడినట్టి భాష
తన వంటి మందు వీనులకు విందు
దేశ భాషలందు తెలుగు లెస్స!!!
తెలుగు దేల నన్న దేశంబు దెలుగేను
తెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపులగొలువ నెరుగ వే బాసాడి
దేశభాషలందు తెలుగు లెస్స!!!
గుండె లోతుల్లోంచి వచ్చేదీ - మనసు విప్పి చెప్పగలిగిందీ మాతృభాషలోనే.
సాంస్కృతిక అనుబంధమే తెలుగు భాష రక్షాబంధనం
తెలుగులో సంతకం స్వాభిమాన సంకేతం
తేట తెలుగు - జీవితానికి వెలుగు.
మన భాష మన వారసత్వం.
తల్లిని మరువలేనట్లే తల్లి భాషనూ మరువరాదు.
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు.
ప్రాంతాలు వేరైనా జాతులెన్నైనా తెలుగు వారంతా ఒక్కటే.
ప్రపంచ వ్యాప్తంగా తెలుగును తీర్చిదిద్దడమే తెలుగుల లక్ష్యం కావాలి.
బువ్వపెట్టే భాష తెలుగు - అవ్వమెచ్చిన భాష తెలుగు.
తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది.
అన్ని భాషల కన్న అమ్మ భాషే మిన్న.
పరాయిభాష వద్దు - తెలుగు ముద్దు.
మాతృభాషను ప్రేమించలేనివాడు - మాతృదేశాన్ని ప్రేమించలేడు.
అమ్మ - అమ్మనేల - అమ్మ బాస అమృతం కన్న గొప్పది.
శిశువు శారీరక వికాసానికి తల్లిపాలు - మానసిక వికాసానికి తల్లి భాష.
గోర ముద్దలు పెడుతూ అమ్మ నేర్పిన భాష మన భాష
మాతృభాషను దూరం కానివ్వద్దు - జాతి సంస్కృతిని మరువ వద్దు.
ఒక భాష అంతరిస్తే ఆ జాతి అంతరించినట్లే.
తెలుగులో మాట్లాడండి - తెలుగు భాషను బ్రతికించండి.
దేశ భాషలందు తెలుగు లెస్స!!!

0 comments: