Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
మనలో ఎంత మందికి మన తెలుగు గురించి తెలుసు అని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలం?
మనకు తెలిసిన/తెలియని కొన్ని నిజాలు కింద తెలుపబడినవి.
  • తెలుగు భాషా దినోత్సవం - 29 ఆగస్ట్
  • తెలుగు భాష కు 4000 ఏళ్ళ నాటి చరిత్ర ఉంది. ఇది ఎస్.వెనుగోపాల్ గారు రచించిన "విశ్వ  విజేత" అనే పుస్తకం లో తెలుపబడింది.
  • తెలుగు భాష కు 2008 లో ప్రాచీన భాష హోదా ఇచ్చిన భారతప్రభుత్వం. 
  • సంస్కృతంలోని తియ్యదనమూ, తమిళంలోని అమృతత్వమూ, కన్నడంలోని సుమధుర పరిమళమూ కలగలిసిన కమ్మనైన భాష తెలుగు. భారతదేశంలోని అతిప్రాచీన భాషల్లో తెలుగు కూడా ఒకటి. భారత ప్రభుత్వం తెలుగుతో పాటు సంస్కృతం, తమిళం, కన్నడం భాషలకు 2008లో “ప్రాచీన భాష” హోదానిచ్చి గౌరవించింది. 
  • తెలుగు అనే పదం ఎలా ఏర్పడింది? తెలుగు అనే పదం ఎలా ఏర్పడిందనే విషయంపై మనకు విభిన్న వాదనలు వినిపిస్తాయి. ప్రసిద్ధ శైవక్షేత్రాలైన కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం క్షేత్రాల మధ్యనున్న ప్రాంతాన్ని “త్రిలింగ” ప్రాంతమని పిలిచేవారనీ, త్రిలింగ పదం నుంచే తెలింగ, తెలుంగు, తెలుగు అనే పదాలు క్రమంగా వచ్చాయని ఒక వాదన ఉన్నది. కాబట్టి తెలుగువారు కృష్ణా, గోదావరి నదుల మధ్యనున్న ప్రాంతంలో నివసించేవారని చెప్పవచ్చు.
  • తెలుగు భాష మాట్లాడడం వలన మన శరీరంలో 72000 న్యూరాన్లు ఉత్తేజితం అవుతాయి. మరే భాశలోనూ ఇది సాధ్యం కాదు. ఇది శాస్త్రోపేతంగా నిరూపించబడింది.
  • తెలుగు భాశ మయన్మార్ మరియు శ్రీలంక లో విస్త్రుతంగా కనిపిస్తుంది.
  • ప్రపంచంలో ఏ భాషలో లేని జాతీయాలు మరియు సామెతలు మన తెలుగు భాషలో ఉన్నాయి.

0 comments: