Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017
     ఒకానొక సమయంలో ఒక టొపీలు అమ్మే వ్యక్తి టొపీలు అమ్మడానికి బయలుదేరాడు. అతను అన్ని ఊళ్లూ తిరుగుతూ, అన్ని చోట్లకీ వెళ్లి టోపీలు అమ్ముతూ ఉండేవాడు. అలా చాలా టోపీలు అమ్మిన తర్వాత అతనికి అలసటగా అనిపించింది. మండుతున్న సూర్యుడు, భగ్గున ఎండ, ఆకలి, దాహం అన్నీ కలిసి పాపం అతన్ని ఇబ్బంది పెడుతున్నాయి. దారిలో ఒక చెట్టు నీడలో ఆగి, తెచ్చుకున్న భోజనం తిని, మంచినీళ్ళు తాగి, తన టోపీల బుట్ట పక్కన పెట్టుకుని, చెట్టు నీడ లో హాయిగా నిద్రపోయాడు.

    కొంచం సేపటికి లేచి చూస్తే బస్తా లో ఒక్క టోపీ కూడా లేదు. టోపీలు ఎవరు కొట్టేసారబ్బా అని అటూ ఇటూ దిక్కులు చూసాడు.తీరా పైకి చూస్తే చెట్టు మీద కోతులు అన్ని టోపీలు పెట్టుకుని కనిపించాయి. అబ్బా, ఈ కోతులు ఎక్కడ దొరికాయిరా బాబూ అనుకుంటూ టోపీలు ఎలా వెనక్కి తీసుకోవాలో ఆలోచించసాగాడు.

   వెంటనే అతను ఆ కోతులతో నా టోపీలు నాకు ఇచ్చేయండి అన్నాడు. అప్పుడు కోతులు వెక్కిరించాయి. కోపంతో అతను అరిచాడు. కోతులు కూడా అరిచాయి. అలా టోపీలవాడు ఏది చేస్తే అది కోతులు చేయడం గమనించిన టోపీలవాడికి ఒక ఉపాయం తట్టింది.

అతను చప్పట్లు కొట్టాడు. కోతులూ చప్పట్లు కొట్టాయి.
అతను రాయి విసిరాడు. కోతులు కూడా చెట్టుకు ఉన్న పండ్లు తీసి విసిరాయి.
ఇక టోపీలవాడు ఏమాత్రం ఆలస్యం చెయకుండా తన తలపై ఉన్న టోపీని తీసి కిందకి విసిరాడు. కోతులు కూడా వాటి తలపై ఉన్న టోపీలన్నీ కిందికి విసిరాయి.
బతికానురా దేవుడా అనుకుంటూ ఆ టోపీలవాడు టోపీలన్నీ ఏరుకోని పరుగు తీసాడు. 😃

నీతి: కండబలం తగని చోటు బుద్ధిబలం వాడాలి.

0 comments: