Images Source: GOOGLE | Any copyright violations are completely unintentional. Credits given to the concerned person/organization wherever possible. Let us know any such voilation/using without credit. Thanks!

దేశ భాషలందు తెలుగు లెస్స!

Crafted with on Telugu by Kathala Express teamⒸ2017


     మనం చాల సార్లు ఈ పదం వినేఉంటాం. కానీ, ఈ పదం యొక్క అర్థం ఏంటి, అసలు ఈ పదం ఎలా ఏర్పడింది అనేది చాలా మందికి తెలియదు. ఇక్కడ తెలుసుకుందాం.

     అనగనగా ఒక ఊర్లో ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంటికి నాలుగు పక్కలా ఏటవాలుగా ఉండే ఇంటి కప్పు, మధ్యలో చావడి ఉండేది. ఆ పెంకుల మీద ఒక గుమ్మడికాయ పాదు వ్యాపించి ఉంది. దానికి బోలెడు గుమ్మడికాయలు ఉండేవి. ఆ ఇంటి కప్పునే తన ఇంటిలా భావించి ఆ గుమ్మడికాయలతో పాటు ఒక ఎలుక కూడా నివసించేది. ఒక రోజు చావడిలో ఒక మేక పిల్ల గడ్డి మేస్తుండగా ఆ ఎలుక ఒక గుమ్మడికాయని 'పుటుక్కు'న కొరికింది. అప్పుడు ఆ గుమ్మడికాయ తెగి 'జర జరా' జారుతూ 'డబుక్కు'న గడ్డి మేస్తున్న మేకపిల్ల మీద పడింది. వెంటనే ఆ మేకపిల్ల 'మే...మే'.. అంటూ అరిచింది. 

     అలా ఎలుక ఒక గుమ్మడికాయని పుటుక్కున కొరకడం అప్పుడు ఆ గుమ్మడికాయ జర జరా జారుతూ డబుక్కున మేకపిల్ల మీద పడడం వెంటనే ఆ మేకపిల్ల మే...మే.. అంటూ అరవడం ఇది అంతా కలిపి 'పుటుక్కు జర జర డుబుక్కు మే' అనే పదం ఏర్పడింది.

2 comments:

  1. chalaa mandiki teliyani vishayam idi.
    ilage kothakothavi teliyajeyandi.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు.
      తప్పకుండా కొత్తకొత్తవి తెలియజెప్పడానికి ప్రయత్నిస్తాము.

      Delete